![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -133 లో....నీకేం చెప్పాను.. రామలక్ష్మిని బయటకు తీసుకొని వెళ్ళమని చెప్పాను కదా ఎందుకు తీసుకొని వెళ్ళలేదని సీతాకాంత్ ని పెద్దాయన అడుగుతాడు. అంటే అమ్మ గ్రహణం అని చెప్పింది అందుకే అని సీతాకాంత్ అనగానే.. మిమ్మల్ని ఏ గ్రహణం విడదియ్యలేదు. ఎందుకు ఇలా చేస్తున్నావ్ నీపై చాలా కోపంగా ఉందని పెద్దాయన అంటాడు.
ఆ తర్వాత రామలక్ష్మిని పెద్దాయన పిలిచి.. వీడి మైండ్ సరిగా పని చెయ్యడం లేదు. ఆయిల్ రాసి మసాజ్ చెయ్.. ఆ తర్వాత వీపు రుద్ది స్నానం చేయించమని చెప్తాడు. దాంతో రామలక్ష్మి ఆయిల్ తీసుకొని సీతాకాంత్ కి తల అంటుతుంది. సీతాకాంత్, రామలక్ష్మి లు రొమాంటిక్ గా ఫీల్ అవుతారు. అదంతా శ్రీవల్లి చూస్తుంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ స్నానానికి వెళ్తాడు. రామలక్ష్మి టవల్ తీసుకొని వస్తుంటుంది. నిజంగానే వీపు రాయడానికి వచ్చావా అని భయపడ్డానని సీతాకాంత్ అంటాడు. వాళ్ళు హ్యాపీగా ఉండడం శ్రీవల్లి చూడలేక.. వెంటనే శ్రీలత దగ్గరకి వెళ్లి వాళ్ళు పాలు పంచదారల్లా కలిసిపోయారని చెప్తుంది. వాళ్ళను ఎలా విడదియ్యాలో నాకు తెలుసని శ్రీలత అంటుంది.
ఆ తర్వాత సీతాకాంత్ కి టిఫిన్ పెడుతుంది రామలక్ష్మి. అప్పుడే పెద్దాయన వస్తాడు. రండి తాతయ్య కూర్చుండి అని సీతాకాంత్ అంటాడు. మీ మధ్య పానకంలో పుడకలాగా నేనెందుకులే అని చెప్పి వెళ్ళిపోతాడు. సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్తు రామలక్ష్మి వంక ప్రేమగా చూస్తుంటాడు. ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్లిన సీతాకాంత్ దగ్గరకి పెద్దాయన వచ్చి.. కంగ్రాట్స్ రా నీకు ఈ ఇయర్ బెస్ట్ బిజినెస్ మ్యన్ అవార్డు వచ్చిందనగానే సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఎంప్లాయిస్ కంగ్రాట్స్ చెప్తారు. నిన్ను చూసుంటే గర్వంగా ఉంది. ఎక్కడ నుండి ఏ స్థాయికి వచ్చావ్ అని సీతాకాంత్ ని పెద్దాయన మెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |